కేసీఆర్ తీరు దొంగే పోలీసును బెదిరించినట్లుందీ
మాజీ సీఎం కేసీఆర్ తీరుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం
జగిత్యాల, జూన్ (విజయ క్రాంతి ): విద్యుత్ ఒప్పందాల విషయాల్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించిన తీరుపై ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రమైన జగిత్యాల ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ... విచారణాధికారి నరసింహారెడ్డిని వైదొలగమనడానికి కేసీఆర్ ఎవరని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ తీరు దొంగే పోలీసుల ను బెదిరిచ్చినట్టు ఉందని, కేసీఆర్ పై విచారణ కక్ష సాధింపు కాదని, విచారణకు సహకరించకపోవడమే నేరాన్ని అంగీకరించినట్టేనని అన్నారు.
విచారణ అధికారి నరసింహారెడ్డికి కేసీఆర్ భయపడుతున్నాడని న్యాయ వ్యవస్థనే కేసీఆర్ కించపరుస్తున్నాడని, విద్యుత్ ప్రాజెక్ట్ ల లో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటూ కెసిఆర్ కొత్త నినాదం అందుకున్నాడని బొగ్గు లభ్యత ఉన్న రామగుండంలో కాదని దామరాచర్లలో ఎందుకు (యాదాద్రి )థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మించతలచారని ఆయన కెసిఆర్ ను ప్రశ్నించారు . బొగ్గు తరలింపు ఆర్థిక భారం అవుతుందని, కేసీఆర్ తప్పుడు ఆలోచనతో రాష్ట్ర ప్రజానీకం పై 40వేల కోట్ల భారం పడిందన్నారు.
సోలార్ పవర్ తో యూనిట్ 3 రూపాయల కె విద్యుత్ లభిస్తుందని యాదాద్రి థార్మల్ పవర్ తో రాష్ట్ర ప్రజానీకం పై భారం పడుతుందని, యాదాద్రి పవర్ ప్లాంట్ అసలు అవసరం లేదని నరసింహారెడ్డి నివేదిక తో కేసీఆర్ కు భయం పట్టుకుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.






