17 August, 2026 | 8:14 PM

కృష్ణా జాలాల్లో 50:50 వాటా : మంత్రి ఉత్తమ్

16-06-2024 04:28 PM

హైదరాబాద్: నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం సమీక్షించారు. సుప్రీం కోర్టు,ట్రైబ్యునళ్లలో ఉన్న అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కృష్ణా జలాల్లో 50-50 వాటా కోసం ప్రయత్నించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ట్రైబ్యునల్ తీర్పు వచ్చేవరకు సగం వాటా కోసం ప్రయత్నించాలని సూచించారు. శ్రీశైలం, సాగర్ కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించేది లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో వాటా, ప్రజల ప్రయోజనాల కోసం చర్యలు చేపట్టాలని తెలిపారు. మహారాష్ట్ర, కర్నాటకతో చర్చలు జరపటం మంచిదని వైద్యనాథన్ తెలిపారు. దీంతో మహారాష్ట్ర, కర్నాటక చర్చలకు మంత్రి ఉత్తమ్ అనుమతి ఇచ్చారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు చట్టబద్ధమైన వాటా దక్కాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాకు అన్ని చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ పేర్కొన్నారు. సుప్రీం కోర్టు, ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్, రవీందర్ రావు, ప్రభుత్వ సలహాదారు ఆధిత్యనాథ్ దాస్, ఇంజినీర్లు పాల్గొన్నారు.