నీట్ వ్యవహారంపై ప్రధాని స్పందించాలి: కేటీఆర్
16-06-2024 03:12 PM
హైదరాబాద్: నీట్-యూజీ పరీక్ష వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేంద్రానికి లేఖ రాశారు. విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా కేంద్రం పట్టిం చుకోవట్లేదని కేటీఆర్ అన్నారు. ఓవైపు గ్రేస్ మార్కుల గందరగోళం మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంలో తల్లిదండ్రుల్లో ఆందోళన చెందుతున్నా రని స్పష్టం చేశారు.
పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని.. నీట్ వ్యవహారంపై స్పందించాలని కేటీఆర్ పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంలో విచారణ చేపట్టి.. బాధ్యులను శిక్షించాలని కోరారు. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని చెప్పారు. విద్యార్థులకు, లక్షలాదిమంది తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలన్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.






