కేటీఆర్‌పై ఈ రేసింగ్ కేసు.. స్పందించిన ఎమ్మెల్సీ కవిత
19-12-2024 07:53 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఈ కార్ రేసింగ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై నమోదైన కేసుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలను గమనిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చకు భయపడి తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. తాము కేసీఆర్ సైనికులం అని, తెలంగాణ పోరాటం, ఉద్యమం నుంచి వచ్చిన వాళ్లం అని, ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టిన భయపడే వాళ్లం కాదని కవిత పేర్కొన్నారు.






