11 May, 2026 | 6:37 PM

ఖమ్మంలో రైతుల కోసం మహాధర్నా

24-04-2026 01:17 PM

కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ నేతల ధర్నా.. కలెక్టర్ కు వినతి

ఖమ్మం,(విజయక్రాంతి): రైతులు గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులను, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మంలో రైతు మహా ధర్నా(Rythu Maha Dharna) చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మదు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున తరలి వచ్చిన రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు.

మొక్కజొన్నలను, వరిని కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. జే.సీ శ్రీనివాసరెడ్డికి లికిత పూర్వకంగా వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Former Minister Puvvada Ajay Kumar), ఎంపీ  రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఇతర పార్టీ ముఖ్య నాయకులు హాజరై ప్రసంగించారు. ప్రభుత్వ విధానాలను, రైతులు పట్ల వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. ప్రభుత్వంపై విమ్మర్శలు చేశారు.