14 May, 2026 | 2:59 PM

నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలితే నేనే కూల్చివేస్తా..

27-08-2024 12:17 PM

హైదరాబాద్: ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. హిమాయత్ సాగర్ లో ఉన్న గెస్ట్ హౌస్ పై  ఎమ్మెల్సీ వివరణ ఇచ్చారు. మేం గెస్ట్ హౌస్ ను ప్రభుత్వ నిబంధనాల ప్రకారమే నిర్మించుకున్నామని, నిబంధనల ప్రకారం లేదని తేలితే నేనే కూల్చివేస్తానన్ని పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. చెరువుల్లో ఆక్రమణల కూల్చివేతను తను సమర్థిస్తున్నాని, ఎలాంటి చెరువు భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మించలేదన్నారు.

111 జీవో పరిధిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా మంది నిర్మాణాలు చేసుకున్నారని, తనకు ప్రభుత్వం అనుమతి ఇస్తేనే గెస్ట్ హౌస్ ను నిర్మించుకున్నట్టు ఆయన తెలిపారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉంటే కూల్చేయమని చెప్తున్నామని, పట్టాభూమిలోనే ఆయన గెస్ట్ హౌస్ ఉందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి వివరాలు తెలియకుండా మాట్టాడారని భావిస్తున్నట్లు పట్నం ఎద్దెవా చేశారు. తన గెస్ట్ హౌస్ కు దగ్గరలోనే చాలా ఫంక్షన్ హాళ్లు ఉన్నాయని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వెల్లడించారు.