కోనోకార్పస్ చెట్ల ను కొట్టేయొద్దు.. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)
అమరావతి : కోనోకార్పస్ చెట్ల ను అకారణంగా కొట్టేయడాన్ని అడ్డుకోవాలంటూ జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం( PIL) దాఖలైంది. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లం లక్ష్మారెడ్డి ఈ వ్యాజ్యాన్ని సమర్పించారు. బటన్ వుడ్ గాపిలువబడే ఈ చెట్ల కు వ్యతిరేకంగా పలు అపోహలతో సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జరుగుతోందని ఆయన తెలిపారు.
అపోహలు, పుకార్లు.. అవాస్తవం
ఈ చెట్లు పెద్ద మొత్తంలో నీటిని వినియోగిస్తాయని, భూగర్భజల స్థాయిలను ప్రభావితం చేస్తూ, పైపులైన్లను ధ్వంసం చేస్తాయని ఆరోపణలు నిజం కావన్నారు.చెట్టు పుప్పొడి , గింజలు పలు అలెర్జీలు, శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా కు తదిదర సమస్యలకు కారణమవుతాయని కొందరు నిరాధారమైన వాదనలు చేస్తున్నారు. ఆక్సీజన్ విడుదల చేయవు, జంతువులు సైతం తినవని ఇలా పలు రకాల అశాస్త్రీయమైన ప్రచారం చేపట్టడం దురదృష్టకరం అన్నారు.
కోనోకార్పస్ స్థానిక వృక్షసంపదను ఆక్రమించే జాతిగా, పర్యావరణ వ్యవస్థలను తలకిందులు చేస్తందని పలు పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని ఆయన తన పిల్ లో ఆరోపించారు. గాలి వాస్తవానికి కోనోకార్పస్ చెట్లు కాలుష్య కారకాలను గ్రహించి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తూ నేల కోత ను నివారిస్తాయి. వాటి మూలాలునిలబెట్టి, కోతను తీర ప్రాంతాలలో మట్టిని పరిరక్షిస్తూ స్థానిక వన్యప్రాణుల జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.






