4 పీఎస్‌యూ బ్యాంక్‌ల డివిడెండు చెల్లింపు

11-07-2024 02:09:46 AM

న్యూఢిల్లీ, జూలై 10: నాలుగు పీఎస్‌యూ బ్యాంక్‌లు.. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ప్రభుత్వానికి భారీ డివిడెండు చెల్లించాయి. రూ.6,481 కోట్ల విలు వైన డివిడెండు చెక్కులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బుధవారం అందించాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా సీఈవో దేబదత్త చాంద్ రూ.2,514 కోట్ల చెక్కును, కెనరా బ్యాంక్ సీఈవో సత్యనారాయణ రాజు రూ. 1,838 కోట్ల చెక్కును,  బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈవో రజనీశ్ కర్నాటక్ రూ. 935 కోట్ల డివిడెండు చెక్కును అందించారు. ఇండియన్ బ్యాంక్ రూ. 1,139 కోట్ల విలువైన చెక్కును ఇచ్చింది. ఈ నాలుగు పీఎస్‌యూ బ్యాంక్‌లతో పాటు ఎగ్జిమ్ బ్యాంక్ కూడా రూ.252 కోట్ల చెక్కును అందించింది.