5 May, 2026 | 1:59 AM

మహిళా సాధికారతకు ఎంఎంసీ ప్రోత్సాహం

05-05-2026 12:00 AM

ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

సికింద్రాబాద్,మే04 (విజయక్రాంతి): మహిళా సాధికారతకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. సోమవారం తార్నాకలోని ఎం ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘం  స్టాల్ను కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా సొంత వ్యాపారం నిర్వహిస్తున్న స్వయం స హాయక సంఘం సభ్యులను అభినందిచా రు. స్థానికంగా తయారైన ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించేందుకు ఎంఎంసీ ప్రత్యేకం గా స్థలం కల్పించడం ద్వారా, స్వయం సహాయక సంఘాల మహిళలకు తమ ఉత్పత్తు లకు విస్తృత గుర్తింపు లభించడంతో పాటు ఆదాయం పెంపు, ఆర్థిక స్వతంత్రత సాధించే అవకాశాలు మెరుగుపడుతున్నాయని కమిషనర్ తెలిపారు.

చేతిపనుల ఉత్పత్తులు, ఆరోగ్య సంబంధిత వస్తువులు, గృహావసర ఉత్పత్తుల విక్రయం ద్వారా మహిళలు స్వ యం సమృద్ధి వైపు ముందడుగు వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళల ఆధ్వ ర్యంలో నడిచే చిన్న వ్యాపారాలను బలోపే తం చేస్తూ, సమాజాభివృద్ధికి తోడ్పడే జీవనోపాధి కార్యక్రమాలకు ఎంఎంసీ నిరంత రం మద్దతు అందిస్తుందని తెలిపారు. మహి ళా సాధికారత దిశగా స్వయం సహాయక సంఘాలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు కార్పొరేషన్ కట్టుబడి పనిచేస్తోం దని కమిషనర్ స్పష్టం చేశారు.

ప్రజావాణిలో 24 వినతుల స్వీకరణ..

ప్రజలు వారి సమస్యలను నేరుగా విన్నవించుకునేందుకు ప్రతి సోమవారం నిర్వ హించే ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం రోజున మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తార్నాకలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను నేరు గా కలిసి వారి సమస్యలు, వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత విభాగాల అధికారులు కూడా పాల్గొని సమస్యలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 24 వినతిపత్రాలు అందగా, వాటిని సంబంధిత విభాగాలకు పంపించి తక్షణ పరిష్కారం కోసం కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ కార్పొరేషన్ కట్టుబడి ఉందని, వాటి పరిష్కారం వరకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో అందిన వినతిపత్రాలు  విభాగాల వారీగా: ఇంజినీరింగ్ విభాగం 6, టౌన్ ప్లానింగ్ విభాగం  17,శానిటేషన్ - 1, మొత్తం 24వినతులు అందాయి.ప్రజా సమస్యల పరిష్కారా నికి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.