26 March, 2026 | 2:56 AM

మొబైల్స్ రికవరీ.. బాధితులకు అందజేత

26-03-2026 01:13 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 25(విజయక్రాంతి): మొబైల్ ఫోన్ల రికవరిలో జిల్లా పోలీస్ యంత్రాంగం మంచి ఫలితాలు సాధించింది. జిల్లాలో పోయిన, చోరీకి గురైన సుమారు రూ.10 లక్షల విలువ చేసే 108 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేసిన వాటిని బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ సంబంధిత యజమానులకు  అందజేశారు.

ఈ సంద్భంగా జిల్లా ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మొబైల్ ఫోన్లలో బ్యాంక్ ఖాతాలు, పాస్వరడ్స్ వంటి కీలకమైన సమాచారం ఉండటం వల్ల మొబైల్ పోయిన వెంటనే పోర్టల్ www.ceir.gov.in లో ఫిర్యాదు చేసి ఫోన్ను బ్లాక్ చేయాలని సూచించారు.

సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని తెలిపారు.సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా మొబైల్ ఫోన్ల రికవరిలో కృషి చేసిన ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, ఐటీ కోర్ టీమ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఆసిఫాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్, వాంకిడి ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.