11 June, 2026 | 1:30 AM

బడి మనది.. స్వచ్ఛత బాధ్యత మనదే..

11-06-2026 12:30 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, జూన్ 10 (విజయ క్రాంతి): ఈనెల 13న “స్వచ్ఛ పాఠశాల” పేరుతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిని పరిశుభ్రం చేసే కార్యక్రమానికి ఊరూవాడా తరలిరావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. “బడి మనది, ఆ బడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదని, ఊరూవాడా కదలి వచ్చి “స్వచ్ఛ పాఠశాల” కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు సహా ప్రతి ఒక్కరూ కదలి రావాలని, ముఖ్యంగా రాజకీయాలతో సంబంధం లేకుండా బీజేపీ సహా అన్ని పార్టీల నాయకులు తమ తమ జెండా, ఎజెండా, పార్టీ కండువాలను పక్కన పెట్టి స్వచ్ఛందంగా తమ తమ గ్రామాల్లోని పాఠశాలలకు ఈనెల 13న ఉదయమే తరలి రావాలని పిలుపునిచ్చారు. “స్వచ్ఛ పాఠశాల”లో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈనెల 13న చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి వెళ్లి అక్కడి పాఠశాలను పరిశుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు.