ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాక్ పార్లమెంటు కార్యక్రమం

28-09-2026 | 08:32pm

నేరేడుచర్ల, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా, నేరేడుచర్లలోని పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ నందు సోమవారం నాడు మాక్ పార్లమెంటు కార్యక్రమం(Mock Parliament Program) ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్పీకర్, ప్రధానమంత్రి, వివిధ శాఖల మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, సభ్యుల పాత్రలను చక్కగా పోషించారు. పార్లమెంట్ సెషన్స్ ఎలా జరుగుతాయో, పరిపాలన, శాసనాలు విధివిధానాల పట్ల అవగాహన పెంచుకుని పాత్రలను సమర్థవంతంగా పోషించారు.

అనంతరం ప్రధానోపాధ్యాయులు బట్టు మధు మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, రాజకీయాంశాలు ప్రజాస్వామ్యం, పరిపాలన, రాజ్యాంగ ఔనత్యం, సభా నియమాలు నిబంధనలు, క్రమశిక్షణ ఇట్టి కార్యక్రమాల ద్వారా పెంపొందుతాయన్నారు. సాంఘిక శాస్త్ర సహోపాధ్యాయుడు జానయ్య విద్యార్థులకు గైడ్ గా వ్యవహరించగా, సహోపాధ్యాయులు రషీద్ ఖాన్, నెమ్మాది వెంకటేశ్వర్లు, వెంకట్ రెడ్డి, భానుమతి, మాధవి, రాంమూర్తి బికోజి శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు