25 May, 2026 | 1:04 AM

యోగా, వ్యాయామం ఆరోగ్యనేస్తాలు

25-05-2026 12:00 AM

చేవెళ్ళ మునిసిపల్ చైర్ పర్సన్ సమత వెంకటరెడ్డి..

ఆదర్శ పాఠశాల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ‘హ్యాపీ సండే‘పొగ్రాం

చేవెళ్ళ మే 24(విజయక్రాంతి): మునిసిపల్ చైర్ పర్సన్ సమత వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హ్యాపీ సండే కార్యక్రమం ఉత్సాహభరితమైన వాతావరణంలో ఘనంగా జరిగింది. పాఠశాలలోని మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ... హ్యాపీ సండే కార్యక్రమాలు ఒంటికి, మనస్సుకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన యోగా వ్యాయామం ఆరోగ్యానికి ఆప్త నేస్తాలన్నారు.

ఉదయాన్ని సంపూర్ణ ఆరోగ్య వాతావరణంలో గడిపేందుకు, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడమే ఈ వేడుక ఉద్దేశమన్నారు. సామూహికంగా యోగా, శారీరక దారుద్యం కోసం వ్యాయామాలు మంచివాన్నారు. అనంతరం నిత్య జీవితంలో శారీరక శ్రమ ప్రాముఖ్యతను కమీషనర్ బి.యాదగిరి వివరించారు. క్రమమైన వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. కరాటే సెల్ఫ్ డిఫెన్స్ ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

కరాటే దుస్తులు ధరించిన బాలబాలికలు కృష్ణ కరాటే మాస్టర్ల ఆధ్వర్యంలో చేసిన పంచింగ్స్, కిక్స్  విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల క్రమశిక్షణ, ఏకాగ్రత ఆత్మరక్షణ నైపుణ్యాలను చూసి అక్కడికి విచ్చేసిన పెద్దలు, తల్లిదండ్రులు చప్పట్లతో వారిని  ప్రోత్సహించారు. కార్యక్రమానికి విచ్చేసిన పిల్లలకు పండ్లు, మజ్జిగ అందించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు, కరాటే మాస్టర్లకు తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కాసుల రాములు, 15వార్డు కౌసిలర్ బండారి శైలజ ఆగిరెడ్డి,14వార్డు కౌసిలర్ మద్దెల శ్రీనివాస్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.