09-02-2026 12:42:27 AM
ఈనెల 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుకు గడువు
6 నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్ల కోసం పరీక్ష
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష ఏప్రిల్ 19న నిర్వహించనున్నారు. ఆరో తరగతి నుంచి 10 వ తరగతి వరకు అడ్మిషన్లకు ఈ పరీక్ష నిర్వహించనున్నా రు. ఈనెల 28వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు ఓబీసీలు రూ.200లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125లు పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష రెండు దఫాలుగా నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరో తరగతి విద్యార్థులకు, 7 నుం చి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.