calender_icon.png 9 February, 2026 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ర్యాగింగ్, మాదక ద్రవ్యాల వినియోగం విద్యార్థుల అభివృద్ధికి విఘాతం

09-02-2026 12:43:24 AM

కాకతీయ యూనివర్సిటీ, పిబ్రవరి 8,(విజయక్రాంతి) : కాకతీయ యూ నివర్సిటీ న్యాయ కళాశాల విద్యార్థులకు సుబేదారిలోని ఆరట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో ర్యా గింగ్, మాదక ద్రవ్యాల నిరోధకత పై అవగాహనా కార్యకార్యక్రమం, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.సుదర్శ న్‌ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ పోలీస్ నార్కోటిక్స్ బ్యూరో, వరంగల్ విభాగం తరపున ఇన్స్పెక్టర్ బి. రవీందర్ వివిధ రకాల మాదక ద్రవ్యాలు,

దుష్ప్రయోజనాల గురించి, వినియోగించిన వారికి చట్ట పరంగా ఉన్నశిక్షల గురించి పవర్ పాయింట్ ద్వారా విస్తతంగా, వివరంగా న్యాయశాస్త్ర విద్యార్థులకు తెలియ జేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ డాక్టర్ సుదర్శన్ మాట్లాడుతూ మాదక ద్రవ్య వినియోగానికి బానిసలైన వ్యక్తులవల్ల వారికి, వారి కుటుంబానికి తీవ్ర నష్టమే గాక సమాజానికి వీరి వాళ్ళ ఎలాంటి ఉపయోగం లేదన్నారు. తెలంగాణ ర్యాగింగ్ నిరోధక చట్టం 1997 క్రింద కఠిన మైన శిక్షలు ఉన్నాయని తెలియ జేశారు. యూజీసీ 2009 రెగ్యులేషన్స్,

ర్యాగింగ్ ను దేశంలోని అన్ని విశ్వ విద్యాలయాల్లో పూర్తిగా నిషేధించిందన్నారు. కార్య కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన యూనివర్సిటీ యూజీసీ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ప్రొఫెసర్‌మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ లా విద్యార్థులు మంచి క్రమశిక్షణ కల్గి తరగతి గదుల్లో నేర్చుకున్న విజ్ఞానాన్నితమ వ్యక్తిగత పురోగతికి, సమాజానికి మార్గ నిర్దేషయం చేసే విధంగా ఎదగాలన్నారు. మేడారం జాతరలో సేవలందించిన ఎన్‌ఎస్‌ఎస్ అధికారిని, విద్యార్థులను కళాశాలప్రిన్సిపాల్ సుదర్శన్, యూజీసీ కోఆర్డినేటర్ మల్లికార్జున రెడ్డి, పొలిసు ఇన్స్పెక్టర్ రవీందర్ తో కలిసి సన్మానించారు.