15 April, 2026 | 2:29 AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

22-11-2025 08:25 PM

మార్కెట్ యార్డులో ఆధునిక వసతులు 

రూ. 55 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

బోయినపల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కవర్ షెడ్ల నిర్మాణం రైతు ఎద్దుల బండి విగ్రహాల నిర్మాణం కోసం శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే మెడికల్ సత్యం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రైతులకు ఆధునిక వసతులతో మార్కెట్ యార్డులో పనులు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర, సన్నబియ్యానికి బోనస్, రైతుబంధు పథకాలు అమలు చేస్తూ రైతులను రాజులను చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయినీ ఎల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి ,పిఎసిఎస్ చైర్మన్లు సురేందర్ రెడ్డి, దుర్గారెడ్డి, తాసిల్దార్ నారాయణ రెడ్డి, ఎంపీడీవో జయశీల ,ఏపీఓ ప్రణీత, ఎంపీఓ శ్రీధర్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల  రమణారెడ్డి ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బాబు, రమేష్, సతీష్, శేఖర్ రెడ్డి,వెంకటేష్, అజయ్, ప్రదీప్, మహేష్, నాయకులు కౌడగాని వెంకటేష్,  సంభ లక్ష్మి రాజం, ఏనుగుల కనకయ్య, నాగుల వంశీ, ఏమి రెడ్డి సురేందర్ రెడ్డి, జోగు రవీందర్, జంగం అంజయ్య, రామిడి శ్రీనివాస్, ఉయ్యాల శ్రీనివాస్, కొమ్మనబోయిన సువిన్ యాదవ్, జంగ సత్యం, నల్ల మోహన్, బోయిని పరుశురాం, బొజ్జ మహేందర్, పొత్తూరి మహేందర్, మెరుపుల జలంధర్, బోయిని లచ్చయ్య, తదితరులు ఉన్నారు,