22-11-2025 08:28:58 PM
* చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేనా భీంభరత్
* కనకమామిడి గ్రామంలో మంజూరైన పంచాయతీ రోడ్డుకు టెండర్లు పూర్తి
మొయినాబాద్,(విజయక్రాంతి): రోడ్ల అభివృద్ధితోనే గ్రామాల అనుసంధానం పెరుగుతుందని చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేనా భీంభరత్ పేర్కొన్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి గ్రామంలో నూతనంగా మంజూరైన పంచాయతీ రోడ్డుకు టెండర్లు పూర్తి కావడంతో ఈ సందర్భంగా శనివారం చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీంభరత్ రోడ్డును సందర్శించి పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్లు అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు విద్యా వైద్య అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. రోడ్డుకు టెండర్లు పూర్తి అయిన సందర్భంగా కనకమామిడి గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ... గ్రామస్తులందరూ కలిసి భీంభరత్ ను అభినందిస్తూ.. శాలువలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.