calender_icon.png 22 November, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిత్రుని కుటుంబానికి స్నేహితుల చేయూత

22-11-2025 08:21:12 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): ర్థిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట మండలం నాగంపేట గ్రామానికి చెందినసోమల హరీష్ కుటుంబానికి తన స్నేహితులు శనివారం చేయూతన అందించారు. పదో తరగతికి చెందిన తన స్నేహితులు అందరూ కలిపి రూ.26 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని మిత్రులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తన స్నేహితులు అజయ్, వెంకటేష్, అభిషేక్, వంశీ, రంజిత్ రెడ్డి, సాయిరాం, సందీప్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.