17 March, 2026 | 6:05 AM

పీహెచ్‌సీలో ఆధునిక సదుపాయలు

21-09-2024 01:12 AM

ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు

కుమ్రంభీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆధునిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. శుక్రవారం పీహెచ్‌సీని ఆ యన తనిఖీ చేశారు. వైద్య సిబ్బందితో సమీక్షించారు. ఆసుపత్రిలో జనరేటర్, ఓటీ టేబుల్, లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు, వీల్ చైర్స్ అవసరం ఉన్నాయని మెడికల్ అధికారి ఎ మ్మెల్యే దృష్టికీ తీసుకెళ్లారు. మంజూరుకు కృ షి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలా గే కౌటాలలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పా టు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.