13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఏఐఎన్‌యూలో ఆధునిక ఐపీ బ్లాక్

11-03-2026 12:07 AM

ప్రారంభించిన సీపీ సజ్జనార్

హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): బంజారాహిల్స్‌లో ఉన్న ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ తన ఇన్పేషెంట్ బ్లాక్‌ను నూతనంగా పునర్నిర్మించింది. మంగళవారం పోలీస్ కమిషనర్ సజ్జ నార్ ప్రారంభించారు. ఈ విభాగంలో రోగులకు అత్యాధునిక చికిత్సా సదుపాయాలు ఏర్పాటుచేశారు. ముఖ్యంగా యూరో ఆంకా లజీ కెమోథెరపీ యూనిట్ ఏర్పాటు చేసి మూత్ర సంబంధిత క్యాన్సర్ రోగులకు ప్రత్యేక చికి త్స అందించనున్నారు. 

యూరోడైనమిక్ స్టడీ, అడ్వాన్స్‌డ్ వీడియో యూడీఎస్ సదుపాయా లు ఏర్పాటుచేశారు. మూత్రాశయ, మూత్ర సంబంధిత సమస్యలను ఖచ్చితంగా గుర్తించేలా చర్యలు తీసుకున్నారు. అక్యూట్ కిడ్నీ కేర్ సదుపాయాలు ఏర్పాటుచేశారు. సజ్జనార్ మాట్లాడుతూ.. ఐపీ బ్లాకును నూతనంగా అభివృద్ధి చేయడం ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించే దిశగా ముందడుగు వేసిందన్నారు.

డా. మల్లికార్జున సి, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్టు, రోబోటిక్ సర్జన్ మాట్లాడుతూ.. అత్యాధునిక పరికరాలతో రూపొందించిన అక్యూట్ కిడ్నీ కేర్ యూనిట్ ద్వారా తీవ్ర కిడ్నీ సమస్యలతో వచ్చే రోగులకు వేగంగా, సమర్థవంతం గా చికిత్స అందించగలమన్నారు. డా. పూర్ణచంద్ర రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెం ట్ యూరాలజిస్టు, యూరో ఆంకాలజిస్టు మాట్లాడుతూ.. యూరోఆంకాలజీ కెమోథెరపీ యూనిట్, వీడియో యూరోడైనమిక్ స్టడీ సదుపాయం, ప్రత్యేక డే కేర్ యూనిట్లతో రోగులకు ఒకేచోట సమగ్ర చికిత్స అందించగలుగుతున్నామని చెప్పారు.