18-07-2025 01:16:53 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (విజయక్రాంతి): పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా గురువారం రిటైల్ ఔట్రీ కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోనూ హోమ్ లోన్, వెహికల్ లోన్ ఔట్రీ ప్రోగ్రామ్‌ను నిర్వహించాయి. జనరల్ మేనేజర్ సచ్చిదానంద్ దూబే (ఎస్‌ఏఎస్‌టీఆర్‌ఏ) సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రిటైల్ ఔట్రీ, కస్టమర్ ఎంగేజ్‌మెంట్ ప్రాముఖ్యతపై టీమ్‌ల ను ప్రోత్సహించారు. ఈవెంట్ సమయంలో లీడ్స్ మొత్తం రూ.194 కోట్లు రాబట్టింది.