25 August, 2026 | 10:31 PM

ఓకే వాహనంలో సభ ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోదీ, చంద్రబాబు

12-06-2024 11:39 AM

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కేసరపల్లిలోని సభ ప్రాంగణానికి ఒకే వాహనంలో బయల్దేరిన ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ చేరుకున్నారు. మోదీ, చంద్రబాబు వేదికపై చేరుకోగానే జాతీయ గీతం ప్రారంభించారు. కాసేపట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు.