ప్రధాని మోదీకి స్వాగతం పలికిన చంద్రబాబు
12-06-2024 11:18 AM
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కాసేపట్లో చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ కార్యక్రమంలో పాల్గొన్నేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ప్రధాని మోదీకి చంద్రబాబు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇప్పటికే ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, అమిత్ షా, వెంకటయ్య నాయుడు, మాజీ సీజేఐ ఎన్.వి రమణ, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నితిన్ గడ్కారీ సభ ప్రాంగణానికి చేరుకున్నారు.






