22 March, 2026 | 1:23 AM

దేశంలో తగ్గిన శిశు మరణాల రేటు

22-03-2026 12:00 AM

ఎక్స్ వేదికగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్  

హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): ప్రధాని మోడీ దార్శనికతతో శిశు మరణాల తగ్గింపులో భారత్ చారిత్రక విజయం సాధించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈమేరకు శనివారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు 79 శాతం, నవజాత శిశు మరణాలు 70 శాతం తగ్గడం మోదీ ప్రభుత్వ సమర్థపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. తల్లి, బిడ్డల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు నేడు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.