9 June, 2026 | 1:16 AM

ప్రజలపై ధరల భారం మోపుతున్న మోదీ

09-06-2026 12:00 AM
  1. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 
  2. ఎల్పీజీ ధరల పెంపుపై కరీంనగర్‌లో కాంగ్రెస్ భారీ నిరసన

కరీంనగర్, జూన్ 8 (విజయక్రాంతి): దేశ ప్రజలపై ప్రధాని మోడీ ధరల భారం మోపుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం అన్నారు. కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన ఎల్పీజీ గ్యాస్ ధరలకు నిరసనగా కరీంనగర్లోని ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన, వంటా వార్పు కా ర్యక్రమం చేపట్టారు. ఖాళీ సిలిండర్లతో, బీజే పీ వ్యతిరేక నినాదాల ప్లకార్డులతో రోడ్డుపై కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ కాంగ్రెస్ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గత నెల రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలపైన కక్షకట్టినట్లుగా విపరీతమైన ధరలను పెంచుతున్నారని అన్నా రు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిన్న ఎల్పిజి గ్యాస్ ధర ఒకేసారి 29 రూపాయలు పెంచి పేద ప్రజలపై భారం మోబైరాన్ని తెలిపారు.

ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ దేశ ప్రజలపై ధరల పెంపు భారం మోపబోతున్నారని దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఈ మోసపూరిత కేంద్ర ప్రభుత్వంపై మనమందరం పోరాడటానికి సిద్ధం గా ఉండాలని రాహుల్ గాంధీ హెచ్చరించినట్లుగానే ఎన్నికలు ముగియగానే ఇప్పుడు ఇంధన ధరలు పెంచి వాటి ప్రభావం నిత్యవసరాలు పైపడటంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారనీ తెలిపారు.

ఒకవైపు నరేంద్ర మోడీ నేను విశ్వగురు అని ఇది వికసిత భారత్ అని ప్రచారం చేసుకుంటూనే ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని అంటగడుతూ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా ఈ ధరలను దించేంతవరకు ఈ పోరాటం కొనసాగుతుందన్నారు. మోడీ సర్కార్ కు బుద్ధి వచ్చే విధంగా మా పోరాటాన్ని మరిం త ఉధృతం చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ , నాయకులు ఉప్పుల అంజనీ ప్రసాద్, మల్లికార్జున రాజేందర్,పులి ఆంజనేయులు గౌడ్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఆకుల నరసయ్య, మడుపు మోహన్,పర్వతం మల్లేశం, గంట శ్రీనివాస్ కళ్యాణి, పడాల అజయ్ గౌడ్, భాస్కర్ నాయక్, వెన్నం రజిత రెడ్డి, మామి డి సత్యనారాయణ రెడ్డి, అబ్దుల్ రహమాన్, అమీర్, భగవాన్ దాస్, వాయినాల సత్యనారాయణ, పాల్గొన్నారు.