తాగునీటి సమస్య పరిష్కరించాలి
మేడిపల్లి, జూన్ 8 (విజయక్రాంతి): మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని 9వ డివిజన్ మేడిపల్లి ధరణి కాలనీలో నూతన నీటి పైప్లైన్ ఏర్పాటు చేసి తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని, అదేవిధంగా, 10వ డివిజన్ పీర్జాదిగూడ మల్లికార్జున నగర్లో రోడ్డు నెం.01 నుండి రోడ్డు నెం.06 వరకు ప్రస్తుతం ఉన్న 90 మి.మీ. హెచ్డిపిఈ పైప్లైన్కు అనుసంధానంగా 150 మి.మీ. డి.ఐ. వాటర్ సప్లై పైప్లైన్ ఏర్పాటు చేసి అవసరమైన జంక్షన్లు కల్పించాలని కోరుతూ ఉప్పల్ జోన్ హెచ్ ఎం డబ్ల్యు ఎస్ ఎస్ బి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజకి తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో ధరణి కాలనీ సభ్యులు, మల్లికార్జున నగర్ వాసులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ, ధరణి కాలనీలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నీటి పైప్లైన్ వ్యవస్థ అందుబాటులో లేకపోగా, మరికొన్ని ప్రాంతాల్లో పైప్లైన్ ఉన్నప్పటికీ సరిపడా తా గునీటి సరఫరా జరగడం లేదని తెలిపారు. దీంతో కాలనీవాసులు నిత్యం తాగునీటి ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నా రు, ధరణి కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనే జీ లేకపోవడంతో మున్సిపల్ అధికారిలకు తెలిపటంతో వారు కూడా కాలనీలో పర్యటించి సమస్య ఉన్న చోట పరిశీలించటం జరిగింది.
ధరణి కాలనీలో నూతన పైప్లైన్ ఏర్పాటు, తాగునీటి సరఫరా సామర్థ్యాన్ని పెంచే చర్య లు, అలాగే మల్లికార్జున నగర్లో ప్రతిపాదిత పైప్లైన్ పనులను త్వరితగతిన మంజూరు చేసి అమలు చేయాలని తుంగతుర్తి రవి కో రారు. ఈ వినతిపై స్పందించిన ఈడీ పంకజ సంబంధిత ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చా రు. ఈ కార్యక్రమంలో జంగాచారి, అంజిరెడ్డి, చింతం చంద్రశేఖర్, ధరణి కాలనీ ప్రెసి డెంట్ భీమిడి శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ గోపిరెడ్డి కృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సా మ తిరుమలరెడ్డి, ప్రకాష్, శేఖర్, శ్రీనివాస్ గౌడ్, కాలనీవాసులు పాల్గొన్నారు.






