8 May, 2026 | 3:03 AM

బీసీల డిమాండ్లపై మోదీ ప్రకటన చేయాలి

08-05-2026 01:40 AM

విశ్రాంత ఐఏఎస్ టి.చిరంజీవులు డిమాండ్

ముషీరాబాద్, మే7 (విజయక్రాంతి): బీసీ ల హక్కులను దృష్టిలో ఉంచుకుని వారి న్యాయమైన డిమాండ్లపై ఈనెల 10న రాష్ట్రానికి రాబోతున్న సందర్భంగా స్పష్టమైన హామీ ని ఇవ్వాలని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం, బీసీ పోలిటికల్ ఫ్రంట్ డిమాండ్ చేసింది. ఈ మేర కు గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు, ఫ్రంట్ ఛైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ 10 డిమాండ్లతో కూడిన ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటాకల్పిం చాలని ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు కేటాయించిన 42 శాతం రిజర్వేషన్లకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని కోరారు. బీసీల బడ్జెట్‌ను ఈడబ్ల్యూఎస్‌కు మళ్లించి, దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు కేవలం 3 శాతం మాత్రమే కేటాయించ డం అన్యాయమన్నారు. బీసీలకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రెండ్ కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, అంబాల నారాయణ గౌడ్, భైరి శేఖర్, వెంకన్న పాల్గొన్నారు.