8 May, 2026 | 3:03 AM

ఫార్మా సిటీ రైతుల పక్షాన రణం చేస్తాం

08-05-2026 01:42 AM
  1. ఫ్యూచర్ సిటీ పేరుతో బలవంతపు భూసేకరణ తగదు
  2. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

ముషీరాబాద్, మే 7 (విజయక్రాంతి) : ఫార్మా సిటీ రైతుల పక్షాన రణం చేస్తామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను వెంటనే రైతులకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ‘ఫార్మా సిటీలో ఏం జరుగుతోంది’ అంశంపై గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. ఫార్మా సిటీ భూసేకరణ కోసం తెచ్చిన జీవో 31 ను రద్దు చేయాలన్నారు.

ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో రైతులను ఆగం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఫార్మాసిటీ భూముల విషయంలో గత ప్రభుత్వం నిసిగ్గుగా అబద్దాలు చెబితే...అవే అబద్దాలను ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందని మండిపడ్డారు. ఫార్మా సిటీ భూముల విషయంలో తెలంగాణ రక్షణ సేనయే ముందుండి బాధితుల తరఫున కొట్లాడుతుందన్నారు. ఫార్మా సిటీ బాధి త రైతుల సమస్య పరిష్కరించే వర కు కొట్లాడుతామని స్పష్టం చేశా రు.

గత ప్రభుత్వం ఫార్మాసిటీ లో భూముల సేకరణ కోసం జీవో 31ను తీసుకొచ్చిందన్నారు. అయి తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేస్తామని చెప్పి... అధికారంలోకి వచ్చాక రైతుల మోసం చే స్తుందన్నారు. ఫార్మా సిటీ, ప్యూచ ర్ సిటీ సహా చాలా అంశాల్లో ప్రభుత్వం అబద్దాలు చెబుతుందన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ మీ టింగ్‌లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నోటి వెంట రైతులు పండించే ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదన్న మాటలు వచ్చాయన్నా రు.

కానీ ఈ విషయాన్ని ఏ మీడియా రాయలేదన్నారు. వచ్చే ఏడాది నుంచి పంట కొ ను గోళ్లు ఉండవన్నారు. అందుకోసం ముగ్గురు మంత్రులతో రేవంత్‌రెడ్డి కమిటీ వే శారని కవిత చెప్పారు. ఆ కమిటీ ఈ ఏడాది రై తుల పంట కొనుగోలు చేయాలని సూచించిందని... కానీ వచ్చే ఏడాది నుంచి పంట కొ ను గోళ్లు ఉండవన్నారు. చాలా విషయాల్లో ప్ర భుత్వం ఇలాగే మోసాలకు పాల్పడుతుంద న్నారు.