15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

హెచ్‌సీయూ భూములపై మోదీ వాస్తవాలు తెలుసుకోవాలి

15-04-2025 12:00 AM

ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి  

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): కంచగచ్చి భూము లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ వాస్తవాలు తెలుసుకోకుం డానే తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఆ భూమి వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. ఏ1 మార్ఫింగ్ ఫోటోలను చూసి ప్రధాని మోదీ విమర్శలు చేసినట్లు ఉన్నారని తెలిపారు.

ఓబీసీ అ ని చెప్పుకునే మోదీ ఇప్పటీ వరకు కుల గణనపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. మాజీ మంత్రి జానారెడ్డిపై ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను ఖండించనని, అలా అని సమర్థించినట్టు కాదని ఎంపీ చామల సమాధానమిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి ఇన్ చార్జిగా ఉన్నది వాస్తవమేనన్నారు. ఎంపీగా తన విజయంలో పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ శ్రేణులు పని చేశారన్నారు.