18 July, 2026 | 1:42 PM

మోదీ వర్సెస్ రాహుల్

15-12-2024 01:55 AM

భారత రాజ్యాంగంపై శనివారం సుదీర్ఘ చర్చ జరిగింది. ‘75ఏళ్ల భారత రాజ్యాంగ దివ్య పథం’పై రెండో రోజు ప్రారంభమైన చర్చ అధికార, విపక్ష పార్టీల పదునైన ప్రసంగాలతో వేడెక్కింది. అధికార బీజేపీ జవహరల్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది. ఇదే సమయంలో కాంగ్రెస్.. గౌతమ్ అదానీ, వీడీ సావర్కర్‌ల పేర్లను ప్రస్తావించి అధికార పక్షం విమర్శలను తిప్పి కొట్టే ప్రయత్నం చేసింది.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: 


రాజ్యాంగంపై వాడివేడి చర్చ

ఆరోపణలు ప్రత్యారోపణలతో దద్ధరిల్లిన లోక్‌సభ

రాజ్యాంగ స్ఫూర్తికి కాంగ్రెస్ తూట్లు పొడిచిందన్న ప్రధాని మోదీ

సావర్కర్ లక్ష్యంగా బీజేపీపై రాహుల్ విమర్శలు

రాజ్యాంగాన్ని మార్చేందుకు కాంగ్రెస్ కుట్ర: పీఎం మోదీ

రాజ్యాంగాన్ని దెబ్బ తీయడానికి కాంగ్రెస్ చేయని పనంటూ లేదని ప్రధాని నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. లోక్‌సభలో రాజ్యాంగం పై చర్చలో ముగింపు ప్రసంగం చేసిన ప్రధాని నరేంద్రమోదీ విపక్ష కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు నెహ్రూ అప్పట్లో అనేక విధాలుగా ప్రయత్నించారని ఆరోపించారు. రాజ్యాంగ మార్పుపై రాష్ట్రాల సీఎంలకు లేఖలు సైతం రాసినట్టు తెలిపారు.

నెహ్రూ చర్యలను అప్పటి స్పీకర్ రాజేం ద్ర ప్రసాద్ సమా అనేక మంది పెద్దలు వ్యతిరేకించినట్టు పేర్కొన్నారు. అయినా ఆయన ఎవ్వ రి మాటలను వినలేదని విమర్శించారు. 194 7 52 మధ్య ఎన్నికైన ప్రభుత్వం భారత్‌లో లేదన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ దేశానికి తీరని నష్టం కలిగించిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ తన సొంత రాజ్యాంగాన్నే గౌరవించదని.. అలాంటిది భారత రాజ్యాంగాన్ని ఆ పార్టీ లా గౌరవిస్తుందని విమర్శించారు. 

స్వలాభం కోసమే రాజ్యాంగ సవరణలు

కాంగ్రెస్ 75సార్లు రాజ్యాంగానికి సవరణలు చేసిందని ప్రధాని నరేంద్రమోదీ గుర్తు చేశారు. స్వలాభం కోసమే ఆ పార్టీ ఎక్కువ సార్లు రాజ్యాంగానికి సవరణలు చేసిందని ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి మాత్రమే రా జ్యాంగ సవరణలు చేసినట్టు తెలిపారు. ఆర్టికల్ 370 దేశ ఐక్యతకు అడ్డంకిగా ఉందనీ అందువల్లే దాన్ని రద్దు చేసినట్టు స్పష్టం చేశారు. 

అధికారం కోసం దేశంలో ఎమర్జెన్సీ

కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించడంతో దేశం ఓ జైలులా మారిపోయిందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. కేవలం కుటుంబ అధికారాన్ని రక్షించుకోవడం కోసమే నెహ్రూ కుటుంబం దేశంలో ఎమర్జెన్సీని విధించిందని ఆరోపించారు. ఎమర్జెన్సీ టైంలో దేశంలోని ప్రాథమిక హక్కులకు భం గం వాటిల్లిందని విమర్శించారు. వాక్ స్వాతంత్య్రాన్ని అణిచివేయడం ద్వారా పత్రికల గొంతు నొక్కారని మండిపడ్డారు. వేలాది మందిని అక్రమంగా జైలులో నిర్బంధించారని దుయ్యబ ట్టారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప దోన్నతిని కూడా అడ్డుకున్నారని విమర్శించారు. 

కాంగ్రెస్ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసింది

నెహ్రూ, ఇందిర, రాజీవ్‌లు ముగ్గరూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారని ప్రధాని మోదీ ఆక్షేపించారు. షా బానో కేసులో రాజీవ్ గాంధీ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కల్గించారని ఆరోపించారు. అలాగే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలు అన్ని సోనియా గాంధీనే తీసుకున్నారన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్ప విధానమన్నారు. 

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్

100వ స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకొనే నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రధాని నరేంద్రమోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకు అనుగుణం గా తమ ప్రభుత్వం దేశాన్ని ముందుకు వెళ్తోందని ప్రధా ని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో కాంగ్రెస్ తన హయాంలో ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పించలేదన్నారు.

సావర్కర్‌ను బీజేపీ అవమానిస్తోంది: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అనుసరిస్తోందని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. అయితే బీజేపీ మాత్రం మనుస్మృతిని అనుసరిస్తోందని ఆరోపించారు. రాజ్యా ంగంపై చర్చ సందర్భంగా శనివారం లోక్‌సభలో ప్రసంగించిన రాహుల్.. రాజ్యాంగంపై బీజేపీ ప్రతిక్షణం దాడి చేస్తోందని ఆరోపించారు. ‘రాజ్యాంగంలో భారతీయత లోపించింది’ అని వీడీ సావర్కర్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాజ్యాంగంలో భారతీయత లోపించిందనే విషయాన్ని సావర్కర్ తన రచనల్లో స్పష్టంగా చెప్పారనీ.. బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నట్టు చెప్తోందన్నారు. ఇది సావర్కర్‌ను అవమా నించ డమేన్నారు. సావర్కర్ బ్రిటీష్ ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకున్నట్టు ఇందిరా గాంధీ తనకు చెప్పారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మహత్మా గాంధీ, నెహ్రూ లు జైలుకు వెళ్తే సావర్కర్ మాత్రం బ్రిటీష్ ప్రభుత్వానికి క్షమాపణలు చె ప్పారని ఆరోపించారు. 

యువత, రైతులకు బీజేపీ అన్యాయం

గత పదేళ్ల బీజేపీ పాలనలో 70 పరీక్ష పేపర్లు లీక్ కావడం వల్ల ప్రతిభావంతులైన యువతకు నష్టం వాటిల్లి ందన్నారు. మోదీ ప్రభుత్వం గౌతమ్ అదానీకి అనవసరమైన ప్రయోజనాలు కల్పించడంతొ చిన్న వ్యాపారులు నష్టపోతున్నారని ఆరోపించారు. ఢిల్లీ సరి హద్దుల్లో రైతులపై జరిగిన టియర్ గ్యా స్ ప్రయోగాన్ని ఈ సందర్భంగా రాహు ల్ ప్రస్తావించారు. రైతులు కనీస మద్ద తు ధర కోసం డిమాండ్ చేస్తుంటే ద్రో ణాచార్యుణిలాగ బీజేపీ వ్యవహరిస్తూ అన్నదాతల బొటనవేలు నరికి అంబా నీ, అదానీలకు లాభాలు తెచ్చిపెడుతోందని ఆరోపించారు. 

రాహుల్ వ్యాఖ్యలను తప్పుబట్టిన కిరణ్ రిజిజు

వీడీ సావర్కర్‌పై రాహుల్‌గాంధీ చేసి న వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తప్పుబట్టారు. ఇందిరా గాంధీ 1980లో తాను రాసిన లేఖలో సావర్కర్‌ను ‘భారతదేశ గొప్ప కుమారుడు‘గా అభివర్ణించి నట్టు తెలిపారు. అందుకు సంబంధించిన లేఖను కూడా రిజిజు లోక్‌సభలో బయటపెట్టారు. మరోవైపు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ స్పందిస్తూ రాజ్యాంగాన్ని జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్న వారికి అందులో ఎన్ని పేజీలు ఉన్నాయన్న విషయం కూడా తెలియదని పరోక్షంగా రాహుల్‌ను విమర్శించారు.