calender_icon.png 14 July, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట టూ టౌన్ ఎస్ఐగా మహమ్మద్ ఆసిఫ్

14-07-2025 02:24:53 PM

సిద్దిపేట క్రైమ్, (విజయక్రాంతి): సిద్దిపేట టూటౌన్ పోలీస్ స్టేషన్(Siddipet Two Town Police Station) నూతన ఎస్ఐగా మహమ్మద్ అసిఫ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అనురాధను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు పూల మొక్కను అందజేశారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల పై నిఘా పెంచాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. అదేవిధంగా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.