14-07-2025 02:23:08 PM
మంథని,(విజయక్రాంతి): మంథని ఆర్టీసి బస్టాండ్(Manthani RTC Bus Stand)లో భయం భయం దొంగల భయంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం మంథని బస్టాండ్ లో ప్రయాణికుడి నుంచి రూ. 50,000 రూపాయల నగదును ఒక దొంగ ఎత్తుకెళ్లాడు. మంథని మండలం మల్లెపల్లికి చెందిన రాజయ్య అనే వ్యక్తి కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్ లో అతని బంధువులు చికిత్స పొందుతుండగా, వైద్యుల ఖర్చు నిమిత్తం రాజయ్య రూ. 50 వేల నగదును పట్టుకొని బస్టాండ్ కు రాగా, గమనించిన దొంగ చేతిలో ఉన్న రూ. 50వేల కవరను లాక్కుని పారిపోయాడు. దీంతో రాజయ్య రోదిస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
ఇప్పటికీ పదికి పైనే దొంగతనాలు ఒకే వ్యక్తి చేస్తున్నాడని బస్టాండులో ప్రయాణించాలంటే భయం వేస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. మంథని పట్టణానికి చెందిన ఒక వ్యక్తి ఇప్పటికే ప్రయాణికుల వద్ద నుంచి నగదును దొంగలించాడని, పోలీసులు నామమాత్రంగా అతనిపై చర్యలు తీసుకోవడంతో అతను మరింత బరితెగించి దొంగతనాలకు పాల్పడుతున్నారని ప్రయాణికులు బహిందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆ దొంగను కఠినంగా శిక్షించాలని ప్రయాణికులు మంథని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై మంథని ఎస్ఐ రమేష్ ను వివరణ కోరగా ఇప్పటికే దొంగతనం విషయం లో ఒక వ్యక్తిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. అతనిపై అనుమానంతో విచారణ చేస్తున్నామన్నారు. త్వరలోనే దొంగను పట్టుకొని బాధితులకు న్యాయం చేస్తామన్నారు.