14-07-2025 04:09:25 PM
బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి..
బిచ్కుంద (విజయక్రాంతి): అమ్మ పేరుతో ప్రతి ఒక్కరు రెండు మొక్కలు నాటాలని బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి(Market Committee Chairman Kavitha Prabhakar Reddy) అన్నారు. సోమవారం బిచ్కుంద మార్కెట్ యార్డులో వన మహోత్సవం సందర్భంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కవితా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వనమే మనం మనమే వనం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ప్రకృతిని మనం కాపాడుకుంటే భావితరాలకు ఎంతో మేలు చేసిన వారిమీ అవతామన్నారు. ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 18 కోట్ల మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కవిత ప్రభాకర్ రెడ్డి అన్నారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలిపారు. ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 'అమ్మ పేరుతో ఒక మొక్కను నాటండి' అనే ముఖ్య మంత్రి పిలుపును గుర్తుచేస్తూ, "అమ్మలు కూడా పిల్లల పేరుతో మొక్కలను నాటండి" అని సూచించారు. అంతేకాకుండా, "ప్రతి ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటండి. మీ పిల్లల్లాగే వాటిని సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకృతి పట్ల ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరాన్ని ఆమె ఉద్ఘాటించారు. బిచ్కుంద మార్కెట్ యార్డ్ ఆవరణలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ శంకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్ నాథ్ పటేల్ , యువజన కాంగ్రెస్ నాయకుడు భాస్కర్ రెడ్డి, దర్పల్ గంగాధర్, అజయ్ పటేల్, సాయిని అశోక్, నౌషనాయక్, రాజుపటేల్ ముత్యం, రిజ్వా న్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.