calender_icon.png 15 May, 2025 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీం ఇండియా క్రికెటర్ సిరాజ్

09-07-2024 02:54:11 PM

హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీం ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. టీ20 ప్రపంచ కప్ సాధించినందకు సిరాజ్ ను సీఎం రేవంత్  అభినందించారు. మంగళవారం హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి సిరాజ్ వెళ్లారు.

అనంతరం టీం ఇండియా జెర్సీని సీఎంకి సిరాజ్ బహుకరించారు. భవిష్యత్ లో సిరాజ్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భారత క్రికెట్ జట్టుకు మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రి కోమటి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  కూడా పాల్గొన్నారు.