calender_icon.png 15 May, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటిన సీఎం రేవంత్ రెడ్డి

09-07-2024 02:41:43 PM

హైదరాబాద్ : మహబూబ్ నగర్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. 'వన మహోత్సవం' కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజనర్సింహ పాల్గొన్నారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో అధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. అనంతరం ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు.