30 June, 2026 | 5:56 AM

బెస్ట్ ఫీల్డర్ సిరాజ్

07-06-2024 01:49 AM

న్యూయార్క్: గత వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఆటగాళ్లలో జోష్ నింపాలనే ఉద్దేశంతో బీసీసీఐ తీసుకొచ్చిన ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్ సంప్రదాయాన్ని టీ20 ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తోంది. పొట్టి ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ‘ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్’ మెడల్ కైవసం చేసుకున్నాడు. మ్యాచ్‌లో సిరాజ్ ఒక వికెట్ తీయడంతో పాటు ఐర్లాండ్ బ్యాటర్ గారెత్ డిలానీని తన ఫీల్డింగ్ నైపుణ్యంతో రనౌట్‌గా పెవిలియన్ చేర్చాడు.