13 July, 2026 | 9:53 AM

మోహన్ బాబు మేనేజర్ కిరణ్ అరెస్ట్

11-12-2024 06:31 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): టాలీవుడ్ సినీ నటుడు మంచు మోహన్ బాబు మేనేజర్ వెంకట్ కిరణ్, విజయ్ కుమార్ లను పహడీషరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద తనపై జరిగిన దాడి సీసీటీవీ ఫుటేజ్ ని మాయం చేశారని మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడంతో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. మోహన్ బాబు చికిత్స పొందుతున్న కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లి కిరణ్, విజయ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘర్షనలో కీలకంగా ఉన్న వ్యక్తులను గుర్తించే క్రమంలో మోహన్ బాబుకు చెందిన మరో నలుగురు భద్రతా సిబ్బందని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ అరెస్ట్ చేసినట్లు తెలిస్తోంది.