13 July, 2026 | 9:05 AM

నాగచైతన్య సరసన..

12-12-2024 12:00 AM

నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తండేల్’. ఒకవైపు ఈ చిత్రం షూటింగ్‌ను శరవేగంగా నిర్వహిస్తూనే మరోవైపు విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో మరో చిత్రానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు ఇప్పటికే బయటకు వచ్చేసింది. మరో హీరోయిన్ వచ్చేసి మీనాక్షి చౌదరి అంటూ ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఈ సినిమా అవకాశం అందుకున్నది మీనాక్షి కాదని.. శ్రీలీల అని తెలుస్తోంది. ‘పుష్ఫ 2’లో కిస్సిక్ సాంగ్‌తో దుమ్మురేపిన శ్రీలీలకు చాలా అవకాశాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. నాగ చైతన్య సరసన పూజా హెగ్డే, శ్రీలీల ఫైనల్ అయ్యారని చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.