14 March, 2026 | 1:47 AM

రామాయణాన్ని తెలుగులో రచించిన గొప్ప కవయిత్రి మొల్లమాంబ: ఎమ్మెల్యే జారె

14-03-2026 12:32 AM

దమ్మపేట, మార్చి 13,(విజయక్రాంతి): తెలుగు సాహిత్య చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన మహాకవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి సందర్భంగా దమ్మపేట మండలం, మల్కారం గ్రామంలో ఆమె విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎం ఎల్ ఎ జారే మాట్లాడుతూ రామాయణాన్ని సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా తెలుగులో రచించి ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించిన గొప్ప కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ  అని, కులం స్థితిగతులు అనే అడ్డంకులు ఉన్న కాలంలో కూడా తన ప్రతిభతో తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావురాలని కొనియాడారు. ఆమె రచించిన మొల్ల రామాయణం ఇప్పటికీ ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలుస్తోందని తెలిపారు.

ఇలాంటి మహనీయుల జయంతిని జరుపుకోవడం ద్వారా నేటి తరానికి వారి గొప్పతనం తెలిసి స్ఫూర్తి పొందుతారని పేర్కొన్నారు. మల్కారం గ్రామంలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు గ్రామస్తులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సున్నం రుక్మిణి, ఉపసర్పంచ్ బాలు, శ్రీరాముల ప్రసాద్, గుత్తా రాజా, సిగ్గం వెంకటేశ్వరరావు, బుద్దే కోటేశ్వరరావు, దరిపల్లి వెంకటనారాయణ, సల్మాన్ రాజు, నూతలపాటి ఏసుబాబు, నూతలపాటి నరసయ్య, కపిలేశ్వరపు బాలాజీ, మోతుకూరి రామ దుర్గారావు, శివ కుమార్, రామకృష్ణ, శంకర్ రావు, శ్రీనివాస రావు, కమలాకర్, కిషోర్, వెంకట్రావు, రమేష్, కృష్ణ, రాము తదితరులు పాల్గొన్నారు.