విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ
కల్లూరు, మార్చి 13, (విజయక్రాంతి): కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ ఆశ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా ప్యాడ్స్, పెన్సిల్లు, పెన్నులు, స్కేల్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కల్లూరు మండలానికి చెందిన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ వైద్యులు మాగంటి ప్రభాకర్ రావు సహకారంతో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని అవగాహన కల్పించారు.
ప్లాస్టిక్ బాటిల్స్ వాడకాన్ని నిరోధించాలనే ఉద్దేశంతో విద్యార్థులు స్టీల్ వాటర్ బాటిల్స్ ఉపయోగించాలని సూచిస్తూ సుమారు రూ.8,000 విలువైన స్టీల్ వాటర్ బాటిల్స్ను 50 మంది పదవ తరగతి విద్యార్థులకు అందజేశారు. జడ్పీహెచ్‌ఎస్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజా ప్రభాకర్ చౌదరి, మాజీ ఎంపీటీసీ కుక్క నాగమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగనబోయిన పుల్లారావు,వార్డ్ మెంబర్లు పరిగడుపు మారెమ్మ, దుగ్గిరాల సీతారాములు, ఇనపనూరి వెంకటేశ్వర్లు, ముత్తయ్య,వల్లపునేని అప్పారావు, కాటంనేని బాబురావు,నెల్లూరి జగదీష్, తూము నరసింహారావు,కొమ్మినేని శ్రీను,గంధం నాగమణి,మోదుగు గోవిందు,మాగంటి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.




