05-07-2025 12:00:00 AM
బూర్గంపాడు,జూలై 4(విజయక్రాంతి): వనల్లో ఉండాల్సిన కోతులు జనావాసాల్లోకి చేరి గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాలపై దాడి చేస్తున్నాయి. మండలంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతోంది.ఏ గ్రామంలో చూసినా కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాలపై దాడి చే స్తున్నాయి. ఇళ్లు, దుకాణాల్లో తినుబండారాలు, వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. కూర గాయలు, పండ్ల చెట్లను ధ్వంసం చేస్తున్నా యి.
కోతుల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లలోని ఆహార పదార్థాలు వస్తువులు చిందర వందర చేస్తున్నాయి. కిరాణ షాపులు,పండ్ల దుకాణాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షా పులోని వస్తువులకు రక్షణగా జాలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
కోతుల బెడదతో రేకుల ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. ఆ రు బయట ఎండబెట్టిన పప్పు దినుసులు,ఇతర ఆహార పదార్థాలనూ కోతులు వదలడం లేదు. ఇళ్లలో ఉన్న జామ, బొప్పా యి, ఇతర పండ్ల చెట్లు,కూరగాయల చెట్ల ను, పంటలనూ కోతులు ధ్వంసం చేస్తున్నా యి. ఎక్కడ చూసినా గోతులు బాబోయ్ కోతులు అంటూ పరిగెడుతున్నారు.
భయాందోళనలో ప్రజలు...
కోతుల బెడద రోజు రోజుకు ఎక్కువ కా వడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలో చొరబడి వీరంగం సృష్టి స్తున్న కోతులను తరిమే ప్రయత్నంలో ఎదురు తిరిగి దాడి చేసి గాయపరుస్తున్నాయి. చాలా మంది కోతుల దాడిలో గాయపడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.కోతుల నియంత్రణకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కోతులను బందించి అటవీ ప్రాంతాలకు తరలిం చాలని డిమాండ్ చేస్తున్నారు.
తాము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటి నియంత్రణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించి కోతుల బారి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
-మొరంపల్లి బంజరకోతులు ఇళ్లలోకి చొరబడి వస్తువులను చిందర వందర చేస్తున్నాయి. ఆహార పదార్థాలు, కూరగాయలనుఎత్తుకెళ్తున్నాయి. కూరగాయలు,ఇతర పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వీటిని తరిమేందుకు ప్రయత్నిస్తే అవి దాడులకు దిగుతున్నాయి. అధికారులు వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలి.
కామిరెడ్డి పద్మ, గ్రామస్థురాలు