05-07-2025 12:00:00 AM
మహబూబ్ నగర్ జూలై 4 (విజయ క్రాంతి) : అపరిశుభ్రానికి కేరాఫ్ గా జడ్చర్ల లోని పలు ప్రాంతాలు నిరుస్తున్నాయి. అధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ పరిశు భ్రత వైపు అడుగులు దూరంగా వేస్తున్నారని ఆరోపణలకు బలం చేకూరుతుంది. ఏదో పనులు చేయించాం... అయిపోయింది అనే విధంగా అధికారుల తీరు కనిపిస్తుందని జడ్చర్ల పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్లు నెలలు తరబడి పెండింగ్లో పెడుతూ అపరిశుభరానికి కేరాఫ్ గా నిలుస్తున్నాయి. డ్రైనేజీల సైతం పలు ప్రాంతాల్లో క్ర మం తప్పకుండా శుభ్రం చేయకపోవడంతో చెత్త పేరుకు పోతుందని, వర్షం బాగా కురిసిన సమయంలో మురుగునీరు అంతా రోడ్లపైకి వచ్చి వివిధ రోగాలు అంటుకునే పరిస్థితి నెలపొందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
డెంగీ కేసు నమోదు...
జడ్చర్ల అంటేనే అత్యధికంగా ఇతర ప్రాంతాలవాసులు కూడా ఈ ప్రాంతంలో నివాసం ఉంటారు. ఇందుకు ఆ ప్రాంతంలో ఉన్న కంపెనీలలో పనులు చేసేందుకు గాను ఇతర రాష్ట్రాల నుంచి కూడా అత్యధిక జనం ఈ ప్రాంతానికి వచ్చి పనులు చేసుకునే జీవ నం కొనసాగిస్తుంటారు. దీంతోపాటు ప్రధా న హైవే కూడా జడ్చర్లకు అనుసంధానమై ఉండడంతో ఈ ప్రాంతానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రత్యేక ప్రాథమిక ఉంది.
ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికి డెంగ్యూ రావడంతో ఈ విషయం అధికారులకు తెలియడంతో ఆ ప్రాంతంలో శానిటేష న్ చేసి అంత బాగుంది అనేలా చేసి చేతులు దులుపుకున్నారు. ప్రతి వార్డులో ప్రతి గల్లీలోనూ అత్యధికంగా చెత్త చెదారం పేరుకు పోయి అపరిశుబ్రానికి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. సమస్య వచ్చినప్పుడు కాకుండా నిరంతరం పరిశుభ్రంగా కాలిన ఉంచాల్సిన బాధ్య త అధికారులపై ఉందని ప్రజలు కోరుతున్నారు.
ఖాళీ ప్లాట్లలోని చెత్త ఎవరు ఎత్తాలి..?
అసలు జడ్చర్లలో అపశుభాకానికి కేరాఫ్ అడ్రస్ గా ఖాళీగా ఉన్న ప్లాట్లు కూడా నిలుస్తున్నాయి. గతంలో ఖాళీ ఫ్లాట్లలో చెత్త ఉం డకుండా పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీ సుకోవాలని యజమానులకు నోటీసులు అందించారు. ఆ నిబంధనలు ఇప్పుడు లేవా..? ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదా..? లేక నోటీసులు ఇస్తే ఫ్లాట్ల యజమానులు పట్టించుకుంటలేరా..? అసలు అధికా రులు ఏం చేస్తున్నారో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది.
చిన్నపాటి వర్షాని కే సరస్వతి నగర్, పద్మావతి కాలనీ, నేతాజీ చౌక్, గౌరీ శంకర్ కాలనీ తోపాటు లోతట్టు ప్రాంతాలలో ఉన్న కాలనీలు అన్ని చిన్నపాటి వర్షానికి జలమయం అవుతున్నాయి. వారం పది రోజుల్లో నుంచి కూడా గుంతల్లో మురుగునీరు ఉండడంతో దోమల వృద్ధి చెంది రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి.
-శానిటేషన్ చేస్తున్నాం..
నిరంతరం పట్టణంలో శానిటేషన్ చేస్తున్నాం. ఎక్కడైనా ఫిర్యాదు అందిన వెంటనే మున్సిపల్ సిబ్బందిని పంపించి పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నాం. 23 వార్డులో డెంగీ కేసు నమోదు కావడంతో ఆ ఇంటికి వెళ్లి శానిటేషన్ కూడా చేశాం. కాలువలను కూడా శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం. ఖాళీ జాగాలలో చెత్త పేరుకు పోతే వారికి నోటీసులు అందజేసి అవసరమైన చర్యలు తీసుకుంటాం.
లక్ష్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్, జడ్చర్ల