04-07-2025 11:13:58 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి): హైదరాబాద్లోని ఎల్బీ స్టేడీయంలో నిర్వహిస్తున్న పార్టీ గ్రామ అధ్యక్షుల సమ్మేళనానికి ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని గ్రామ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు తరలి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖార్గే, అధ్యక్షతన నిర్వహిస్తున్న సమావేశానికి మహమ్మద్ నగర్ నిజాంసాగర్ మండలాలకు చెందిన గ్రామ పార్టీ అధ్యక్షులు తరలి వెళ్లారు. నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్, మహమ్మద్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డిలు కార్యకర్తలతో పాటు తరలి వెళ్లారు.