16 April, 2026 | 4:12 PM

Breaking News

నాగిరెడ్డిపేట్ మండల జాగృతి పద్మశాలి అధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   రోడ్డు భద్రతకై వాహనదారులకు కంటి పరీక్షలు తప్పనిసరి   •   ప్రజా పాలన మండల స్థాయి సమావేశం   •   సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు   •   సురక్షిత ప్రయాణానికి కంటి చూపు ప్రధానం   •   మహిళా రిజర్వేషన్ బిల్లు— ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక   •   డీలిమిటేషన్, సవరణ బిల్లులపై ప్రతిపక్షాల నిరసన.. లోక్‌సభలో తీవ్ర వాగ్వాదం   •   మున్సిపల్‌లో పైసల పంచాయతీ   •   మహిళా కోటా బిల్లుపై వాడివేడి చర్చ.. ప్రభుత్వానికి ఇంత తొందర ఎందుకు?   •   మార్కుల విషయంలో నిరాశ.. 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య   •  

దేవాలయ అభివృద్ధికి మరింత కృషి

07-06-2025 04:49 PM

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): రేణుక ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) అన్నారు. భక్తుల పాలిట కల్పవల్లి, కోరిన కోరికలు తీర్చే అమ్మ, క‌న‌గ‌ల్ మండ‌లం ధ‌ర్వేశిపురంలో కొలువైన‌ శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షి 23వ వార్షిక కల్యాణ మహోత్సవం సందర్భంగా శనివారం దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. 

మంగళ వాయిద్యాల న‌డుమ వేద పండితులు శ్రావణ్ కుమార్ చార్యులు, నాగోజు మల్లాచారి, సుదర్శనాచార్యులు, మంత్రిని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకట్‌రెడ్డి ఈఓ జిల్లెప‌ల్లి జయరామయ్య, నల్ల‌గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీ‌నివాస్‌రెడ్డి, ప‌ట్ట‌ణాధ్యక్షుడు మోహన్ రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ గోపాల్ రెడ్డి, ఆలయ సీనియర్ అసిస్టెంట్ చంద్రన్న గౌడ్, నాగేశ్వరరావు, ఉపేందర్‌రెడ్డి, ఆంజనేయులు ధర్మకర్తలు పాల్గొన్నారు.