18 May, 2026 | 2:53 AM

తల్లి, కూతురు దారుణ హత్య

18-05-2026 12:00 AM
  1. కళ్లలో కారం కొట్టి, చున్నీతో ఉరేసి..
  2. ఆస్తి కోసమే దుండగుల ఘాతుకం!
  3. నల్లగొండ జిల్లా ఇబ్రహీంపేటలో ఘటన 

నల్లగొండ, మే 17 (విజయక్రాంతి): బత్తాయిలను తెంపేదుకు తమ తోటకు వెళ్లిన తల్లి, కూతురును దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం నల్లగొండ జిల్లా అనుముల మం డలం ఇబ్రహీంపేట గ్రామంలో జరిగింది. ఇబ్రహీంపేట గ్రామంలో రుద్రాక్షి సుమలత (40), ఆమె కుమార్తె  లావణ్య(20)తో కలిసి నివాసం ఉంటుంది. సుమలత భర్త సుమారు 15 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. అయితే సుమలత కుటుంబానికి వారసత్వంగా సుమారు ఎనిమి ది ఎకరాల భూమి వచ్చింది. ఆ భూమిపై కొం తకాలంగా సమీప బంధువుల తో వివాదాలు నడిచాయి. ఇటీవల సుమలత కుటుంబానికి ఆ భూమి చట్టప్రకారం రాగా లావణ్య పేరిట భూమి రిజిస్ట్రేషన్ అయింది.

ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం తమ బత్తా యి తోటలో బత్తాయిలను తెం పేందుకు తల్లి కూతుర్లు వెళ్లారు. అక్కడే వేచి ఉన్న కొందరు వారి కండ్లలో కారం కొట్టి, చున్నీతో మెడకు ఉరి బిగించి దారుణంగా హత్య చేశారని తెలుస్తోంది. మిర్యాలగూడ డీఎస్పీ రాజ శేఖర రాజు, నాగార్జున సాగర్ సీఐ తేజావత్ శ్రీను నాయక్, అనుముల ఎస్‌ఐ సాయితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. భూతగాదాల నేపథ్యంలోనే దుండగులు హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ మేర కు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు  సీఐ శీను నాయక్ తెలిపారు.