16 April, 2026 | 9:05 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

తుమ్మలసూగూరులో తీవ్ర విషాదం.. తల్లి, కొడుకు మృతి

01-05-2025 03:17 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం తుమ్మలసూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిండిగిర్ని దుకాణంలో విద్యుత్ షాక్ తో తల్లి కుమారుడు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వోజు వడ్ల జయమ్మ(40) కుటుంబ పోషణ కోసం పిండి గిర్ని నడుపుతున్న క్రమంలో కుమారుడు శ్రీకాంత్(15) పదవ తరగతి పూర్తి చేసుకుని మంగళవారం విడుదలైన పది ఫలితాల్లో ఉత్తమ ఫలితాన్ని సాధించాడు.

తల్లికి సహాయంగా పక్కనే ఉండి పిండి గిర్ని పడుతుండగా విద్యుత్ షాక్ తో వణుకుతూ కనిపించాడు. వెంటనే తల్లి గమనించి అతని కాపాడపోయింది ఆమెకు కూడా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు విలవిలలాడుతుండగా పక్కనే ఉన్న కూతురు శిరీష కర్రతో విద్యుత్ మీటర్ను ఆఫ్ చేసింది. ఇద్దరూ కుప్ప కూలి పడిపోగా కుటుంబ సభ్యులు వెంటనే జనరల్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబంలోనే కాకుండా గ్రామంలో తీవ్ర విషాదం ఆలుముకుంది. తన కుమారుడు కుమ్మర ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకుని ఉత్తమ ఫలితాన్ని పొందిన సంతోషం ఆ ఇంట ఎక్కువసేపు నిలవలేదు.