calender_icon.png 1 May, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

01-05-2025 03:12:56 PM

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

మునుగోడు,(విజయక్రాంతి): క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మునుగోడు అధికారిక క్యాంప్ కార్యాలయంలో క్షయ వ్యాధి పోస్టర్ లను విడుదల చేసి మాట్లాడారు.ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వివిధ శాఖల అధికారులు కూడా అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని, క్షయ వ్యాధి లక్షణాలు ఉన్న వారు ఉచితంగా పరీక్షలు చేయించుకొని మందులను తీసుకొని పూర్తి కాలం పాటు వాడాలని,క్షయ వ్యాధి లేని నియోజకవర్గం గా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో మండల వైద్యాధికారి డాక్టర్ నర్మద, మంగి భాయ్, అజయ్, సైదులు, ధనమ్మ, అధికారులు, ప్రజాప్రతినిధి లు ఉన్నారు.