calender_icon.png 1 May, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరేళ్ల బాలుడు అదృశ్యం

01-05-2025 03:21:49 PM

గూడూర్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల పరిధిలోని భూపతి పేటలో ఆరేళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన జరిగింది. కొత్తగూడ మండలం లక్ష్మణ్ తండా చిన్నల్లాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడు వాంకుడోత్ జాన్ పాల్ తన తండ్రితో కలిసి ఆటోలో వస్తుండగా భూపతి పేట వద్ద ఆటోను ఆపి నిద్రించారు. తండ్రి నిద్రలేచేసరికి బాలుడు కనిపించలేదు. బాలుడి ఆచూకీ కోసం చుట్టుపక్కల గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో గూడూరు పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు. బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పోలీసులు గాలిస్తున్నారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు అబ్బాయి తండ్రి: 9676899537, పోలీస్ స్టేషన్ గూడూర్: 8712656963, ఎస్ఐ గూడూర్: 8712656962, సీఐ గూడూరు: 8712656960 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.