29 August, 2026 | 3:43 AM

మహిళకు న్యాయం చేయాలంటూ తల్లి, కొడుకుల ధర్నా

29-08-2026 02:33 AM

గద్వాల, ఆగస్టు 28: తనకు, తన కుమారుడికి న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు రేణుక తన కుమారుడు పవన్తో కలిసి గద్వాల జిల్లా కేంద్రంలోని భీమ్నగర్లో చక్రపాణి ఇంటి ముందు ధర్నాకు దిగారు. గత పదేళ్లుగా చక్రపాణి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్నానని రేణుక తెలిపారు.

తనను వివాహం చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేశాడని ఆమె ఆరోపించారు. చక్రపాణితో తనకు 21 ఏళ్ల కుమారుడు పవన్ ఉన్నాడని పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా వివాహం చేసుకుంటానంటూ కాలయాపన చేస్తున్నాడని రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తల్లి, కొడుకులు చక్రపాణి ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు.