calender_icon.png 2 January, 2026 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నంలో విషం కలిపిన తల్లి

02-01-2026 01:51:26 AM

తల్లి, కూతురు మృతి

ఆందోళనకరంగా కుమారుడి పరిస్థితి

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో విషాదం

కల్వకుర్తి జనవరి 1: అన్నంలో విషం కలిపిన ఓ తల్లి.. పిల్లలతో కలిసి తినడంతో తల్లి తోపాటు కూతురు మృతిచెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో గురువారం జరిగింది. పట్టణంలోని తిలక్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రసన్న (38)కు, కూతురు మేఘన (13), కుమారుడు హర్షిత్ (15) ఉన్నారు. బుధవారం రాత్రి నూతన సంవత్సరం వేళ కేక్ కట్ చే యించి తినిపించింది.

అనంతరం అన్నంలో విషం కలిపి  పిల్లలతో కలిసి తిన్నది. ప్రసన్న సోదరుడు సాయంత్రం ఇంటికి వెళ్లగా ఇం ట్లో అపస్మారక స్థితిలో వారిని గుర్తించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే తల్లి, కూతురు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. హర్షిత్‌ను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ప్రసన్న భర్త రెండు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.